Breaking News

నాలాలు, వరద నీటి కాలువల శుభ్రతపై దృష్టి సారించాలి

Published on Thu, 07/27/2023 - 01:54

రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో ఫ్లడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్‌ రిస్క్‌ మిటిగేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు.

తరచూ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.జి.శాస్త్రి, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ కె.కిషన్, జేఎన్‌టీయూఏ వాటర్‌ రిసోర్సెస్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ ఎం.వి.ఎస్‌.ఎస్‌.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.గోపాల్‌నాయక్, సిటీ ట్రాఫిక్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.నర్సింగ్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)