పదోన్నతి అర్హతలుంటేనే ఇంక్రిమెంట్‌!

Published on Sun, 09/07/2025 - 03:03

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్ల(డీఎల్స్‌)కు వేతన ప్రోత్సాహకాల విడుదలకు అధికారులు విచిత్ర నిబంధనలు తీసుకువచ్చారు. పదోన్నతి పొందేందుకు ఉండాల్సిన అర్హతలుంటేనే ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ కింద ఇంక్రిమెంట్‌ ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ నిబంధన కేవలం 2019 ఆగస్టులో నియమితులైన వారికి మాత్రమే వర్తింపజేస్తున్నట్లు పైఅధికారులు సమాచారం ఇవ్వడంతో వారినుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 2017 జూలై నోటిఫికేషన్‌ ద్వారా నియమితులై 2019 మార్చిలో విధుల్లో చేరిన బ్యాచ్‌కు ఇంక్రిమెంట్లు విడుదల చేసిన సొసైటీ అధికారులు... 2018 ఆగస్టులో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికై 2019 ఆగస్టులో విధుల్లో చేరిన వారికి మాత్రం కొత్త నిబంధనలు వర్తింపచేయడం గమనార్హం. 

గురుకుల విద్యా సంస్థల్లో డిగ్రీ లెక్చరర్లుగా ఎంపికైన వారిని నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌), స్లెట్‌(స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) లేదా పీహెచ్‌డీల్లో ఏదేని ఒకటి అర్హత సాధించడంతో పాటు డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ తప్పకుండా పాసవ్వాలి. అలాంటి వారికి పోస్టుల లభ్యత ఆధారంగా పదోన్నతి ఇస్తారు. వీటిలో అర్హత లేనప్పుడు పదోన్నతికి అవకాశం ఉండదు. కానీ తాజాగా తీసుకొచ్చిన నిబంధనతో ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఇంక్రిమెంట్‌ కూడా ఇవ్వలేమని ప్రిన్స్‌పల్స్‌ చెబుతుండటంతో పలువురు డిగ్రీ లెక్చరర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. 

లిఖితపూర్వక ఆదేశాలు లేవు...
డిగ్రీ లెక్చరర్లకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలతో కూడిన ఆదేశాలేవీ సొసైటీ కార్యాలయం నుంచి లిఖితపూర్వకంగా వెలువడలేదు. కేవలం రాష్ట్ర కార్యాలయంలోని ఓ అధికారి చెప్పిన మౌఖిక ఆదేశాలతో వీటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)