Breaking News

పోడు భూముల రగడ..

Published on Mon, 07/21/2025 - 04:42

ఇచ్చోడ/ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలో పోడు గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూము ల్లో అటవీశాఖ మొక్కలు నాటడాన్ని ముల్తానీలు వ్యతిరేకించారు. కేశవపట్నం, సడక్‌గూడ గ్రామాల మధ్యలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. మహిళలు, పురుషులు, పిల్లలు దాదాపు 200 మంది వరకు రాళ్లు కర్రలతో మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘట నలో ఇచ్చోడ ఎస్సై పురుషోత్తంతో పాటు నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. 

నాలుగు రోజులుగా సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని చెలుకగూడ వద్ద ముల్తానీలు సాగు చేస్తున్న పోడు భూముల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. ఆదివారం కూడా సిబ్బందితో కలిసి బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది అటవీ సిబ్బంది, పోలీసులు సిరిచెల్మ ఘాట్‌పై సడక్‌గూడ వద్ద వేచి ఉన్నారు. ఈక్రమంలో కేశవపట్నం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త అల్తాఫ్‌ స్థానిక ఎస్సై పురుషోత్తంకు ఫోన్‌ చేసి గ్రామస్తులతో మాట్లాడదామని పిలిచారు. దీంతో ఎస్సై ఇద్దరు సిబ్బందితో కలిసి కేశవపట్నం వైçపు వెళ్లారు. అప్పటికే గ్రామస్తులు గాయిద్‌పల్లి రోడ్డు వద్ద వేచి ఉన్నారు. 

వాహనంలో నుంచి దిగిన ఎస్సై, సిబ్బందిని ముల్తా నీలు చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఎస్సై చేతికి గాయమవగా.. వీడియో తీస్తున్న కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌ను లాక్కొని రాయితో తలపై కొట్టారు. పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన ఎస్సై మిగతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకునేలోపు ముల్తానీలు పరారయ్యారు. 20 నిమిషాల తర్వాత పొలాల వైపు నుంచి వచి్చన ముల్తానీలు సిబ్బందిపై మరోసారి రాళ్లతో దాడికి దిగారు. 

ఈ ఘటనలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు ఎదురు దాడికి దిగడంతో ముల్తానీలు పారిపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెలుకగూడ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్, ఉట్నూర్‌ డీఎస్పీ కాజాల్‌సింగ్‌ ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా, ముల్తానీల దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు కానిస్టేబుళ్లను స్థానిక పీహెచ్‌సీ నుంచి రిమ్స్‌కు తరలించారు. చికిత్స అనంతరం సాయంత్రం వారిని డిశ్చార్జ్‌ చేశారు.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)