8 నెలలు.. రూ.1.54 లక్షల కోట్ల ఖర్చు

Published on Sat, 12/20/2025 - 04:03

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ. లక్షన్నర కోట్లు ఖర్చయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.84 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదించగా, 8 నెలల కాలంలో అంటే నవంబర్‌ నాటికి రూ. 1.66 లక్షల కోట్లు రాబడి వచ్చిందని, అందులో 1.54 లక్షల కోట్లు ఖర్చయ్యాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు నాలుగు నెలల సమయం ఉండగా, ప్రభుత్వ అంచనా ప్రకారం మరో 1.2 లక్షల కోట్లు రాబడులు రావాల్సి ఉంది. 

ఖర్చు అనివార్యం : కాగ్‌ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్‌ వరకు ప్రతి నెలా సగటున ప్రభుత్వ ఖజానాకు రూ.19 వేల కోట్ల వరకు సమకూరుతోంది. ఇందులో రెవెన్యూ పద్దు కింద (ప్రభుత్వ నిర్వహణ) రూ.5,500 కోట్ల వరకు ఖర్చవుతుండగా, ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కింద మరో రూ.5,500 కోట్లు అవసరమవుతున్నాయి. 

గతంలో చేసిన అప్పులకు వడ్డీల చెల్లింపు కింద నెలకు సగటున రూ.2,300 కోట్లు అవసరమవు తుండగా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం రూ.1200 కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. మరో రూ.4వేల కోట్లకు పైగా ప్రతి నెలా మూలధన వ్యయం కింద ఖర్చవుతున్నట్టు కాగ్‌ లెక్కలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రాబడులు, వ్యయ పద్దులు జోడెద్దుల్లా ముందుకెళ్తుండటం అటు పాలక వర్గాలను, ఇటు ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాలు పెరిగితేనే ఇతర పథకాల అమలు సాధ్యమవుతుందని, ఇదే పరిస్థితి కొనసాగితే యథాతథంగానే పాలన ఉంటుందని ఆర్థిక నిపుణులు చెపుతుండటం గమనార్హం. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)