Breaking News

మళ్లీ రూ. 5 వేల కోట్లు

Published on Sun, 09/21/2025 - 04:49

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం మరోసారి సిద్ధమైంది. ఆర్‌బీఐ చేపట్టే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నెలలో ఇప్పటికే రూ. 7 వేల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం.. ఈ నెల 23న ఇంకో రూ. 5 వేల కోట్ల రుణం కోసం ఆర్‌బీఐకి ఇండెంట్‌ పెట్టింది. ఈ మొత్తం కలిపితే ఈ ఒక్క నెలలోనే రూ. 12 వేల కోట్లను ఆర్‌బీఐ ద్వారా బహిరంగ మార్కెట్‌ రుణాల రూపంలో రాష్ట్ర ఖజానాకు సమకూరనున్నాయి. 

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 64,539 కోట్లను బహిరంగ మార్కెట్‌ రుణాల రూపంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొంది. అందులో తొలి ఐదు నెలల్లో సేకరించిన రూ. 29,400 కోట్లు, ఈ నెలలో సేకరించే మొత్తం రూ. 12 వేల కోట్లు కలిపితే తొలి ఆరు నెలల కాలానికి రాష్ట్ర అప్పు రూ. 41,400 కోట్లు చేరుకుంది. అంటే ఏడాది కాలంలో తీసుకోవాల్సిన అప్పులో 65 శాతానికిపైగా ఆరు నెలల్లోనే ప్రభుత్వం తీసేసుకుంది. 

గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు రూ. 49,618 కోట్లు. అంటే 2025–26 సంవత్సరానికిగాను ఆరు నెలల్లో తీసుకున్న దాని కంటే కేవలం రూ. 8 వేల కోట్లు అధికం. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. రూ. 56,940 కోట్లను బహిరంగ మార్కెట్‌ రుణాల రూపంలో ప్రభుత్వం తీసుకుంది. అంటే అంతకుముందు ఏడాది కంటే రూ. 7 వేల కోట్లు ఎక్కువగా సేకరించింది. 

ఇప్పడు ఆరు నెలల కాలంలోనే రూ. 41,400 కోట్లు తీసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది అప్పు కనీసం రూ. 70 వేల కోట్లకు చేరుతుందనేది ఆర్థిక నిపుణుల అంచనా. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది రూ. 14 వేల కోట్ల మేర అప్పులు పెరిగే అవకాశాలున్నాయి. ఈ విధంగా ఏటేటా అప్పుల పద్దు పెరగడం ఖజానాను ఆందోళనకర పరిస్థితుల్లోకి నెడుతోంది. అప్పులు పెరిగేకొద్దీ చెల్లింపులు గుదిబండగా మారుతున్నా యని.. అయినా ప్రభుత్వ మనుగడ కోసం అప్పులు అనివార్యమవుతున్నాయని ఆర్థిక శాఖ వర్గాలే అంటున్నాయి.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)