హైటెన్షన్‌ కరెంట్‌ పిరం!

Published on Thu, 09/12/2024 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో రాష్ట్రంలో హైటెన్షన్‌ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం .అనే మూడు ఉప కేటగిరీల విద్యుత్‌ కనెక్షన్లుండగా, మూడింటికి వేర్వేరు చార్జీలు విధిస్తున్నారు. ఇకపై 33 కేవీ, 132కేవీ/ఆపై సామర్థ్యం కనెక్షన్ల చార్జీలను 11 కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానంగా పెంచేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్టు సమాచారం.

కొన్ని హెచ్‌టీ కేటగిరీల్లోని 33 కేవీ కనెక్షన్లకు యూనిట్‌ విద్యుత్‌పై అర్ధరూపాయి వరకు, 132 కేవీ/ఆపై సామర్థ్యం కలిగిన కనెక్షన్లకు రూపాయి వరకు విద్యుత్‌ చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌/టీజీఎనీ్పడీసీఎల్‌) సంస్థలు వారంలోగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను.. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించే అవకాశముంది.  

నవంబర్‌లోనే సమర్పించాల్సి ఉండగా... 
విద్యుత్‌ టారిఫ్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం ప్రతి ఏటా నవంబర్‌ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్, ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు సిద్ధం చేయగా, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో గడువు పొడిగింపు పొందాయి. 

ఉత్తర/దక్షిణ డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం 2023–24లో రూ.6299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, వాటి మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్‌ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, మరో రూ.17,756 కోట్ల నష్టాల్లో టీజీఎన్పిడీసీఎల్‌ సంస్థ ఉంది. దీంతో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు.  

గృహాలు, వాణిజ్య కేటగిరీలకు పెంపు లేదు  
లోటెన్షన్‌ కేటగిరీ పరిధిలోకి వచ్చే గృహాలు, గృహేతర/వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారుల విద్యుత్‌ చార్జీలు పెరగవు.  

హెచ్‌టీలో చార్జీల మోత.. 
హెచ్‌టీ కేటగిరీలోని సాధారణ పరిశ్రమలు, లైట్స్‌ అండ్‌ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్‌ పరిశ్రమలు, ఫెర్రో అల్లయ్‌ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఈ కేటగిరీల వినియోగదారులు తమ అవసరాల మేరకు 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యంతో విద్యుత్‌ కనెక్షన్లను కలిగి ఉన్నారు. 11 కేవీ కనెక్షన్‌తో సమానంగా సంబంధిత 33 కేవీ, 132 కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలను పెంచే అవకాశముంది.

11 కేవీ కనెక్షన్ల చార్జీలు ఇప్పటికే అధికంగా ఉండడంతో యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. హెచ్‌టీ కేటగిరీలోని పారిశ్రామికవాడలు, ఆధ్యాతి్మక స్థలాలు, సాగునీటి పథకాలు, తాగునీటి పథకాలు, రైల్వే ట్రాక్షన్, మెట్రో రైలు, టౌన్‌ షిప్పులు/రెసిడెన్షియల్‌ కాలనీలు, చార్జింగ్‌ స్టేషన్లకు సంబంధించిన 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యమున్న కనెక్షన్లకు ఒకే తరహా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వీటికి చార్జీల పెంపు వర్తించకపోవచ్చు.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)