Breaking News

వరంగల్‌ మెగా జాబ్‌ మేళాలో తొక్కిసలాట

Published on Fri, 04/11/2025 - 16:06

సాక్షి, వరంగల్‌ జిల్లా: వరంగల్‌లో నిర్వహించిన మెగాజాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఎంకే  నాయుడు ఫంక్షన్ హాలఖలో నిర్వహించిన జాబ్ మేళాకు  యువత భారీగా తరలి రావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గేట్ తీయగానే నిరుద్యోగులు  ఒక్కసారిగా దూసుకురావడంతో  తొక్కిసలాట చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్‌ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.

కాగా, 60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో కొండా దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.

ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని గత పది సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని.. అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని కొండా సురేఖ చెప్పారు.

 

 

 

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)