TS: పెండింగ్‌ చలాన్ల చెల్లింపు.. రెస్పాన్స్‌ మామూలుగా లేదు.. దెబ్బకి సర్వర్ డౌన్

Published on Thu, 12/28/2023 - 20:06

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. మరో వైపు చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్‌ హ్యాంగ్‌ అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ. 2.62 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు.

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. 

వివరాల ప్రకారం.. ట్రాఫిక్‌ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. జనవరి 10వ తేదీ వరకు చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. 

చలాన్లలో డిస్కౌంట్‌ ఇలా.. 
►ఆర్టీసీ  డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్
► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్
►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్
►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్.

ఇదీ చదవండి: TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)