Breaking News

ఆపరేషన్‌ ముస్కాన్‌కు సమాయత్తం

Published on Sun, 06/30/2024 - 04:54

సాక్షి, హైదరాబాద్‌:  బాలకార్మికులు, వెట్టిచాకిరీ, యాచన చేసే చిన్నారులు, అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరిట జూలై 1 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కూడిన యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ సిబ్బందితోపాటు కార్మికశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, పాఠశాల విద్య, ప్రజారోగ్య, లీగల్‌ సరీ్వస్‌ అథారిటీతోపాటు ఎన్జీవోలు ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొంటాయి. 

మొత్తం 120 సబ్‌ డివిజనల్‌ కమిటీలు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను ఈనెల 31 వరకు కొనసాగించనున్నాయి. నెలపాటు నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌కు సంబంధించి సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులు పాల్గొని క్షేత్ర స్థాయి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న దర్పణ్‌ పరిజ్ఞానాన్ని సైతం ఈ డ్రైవ్‌లో అధికారులు వినియోగించనున్నారు. ఈ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో గుర్తించే చిన్నారుల వివరాలు నమోదు చేయడంతోపాటు అదృశ్యమైన చిన్నారుల కేసుల గణాంకాలను సరిపోల్చి చూస్తారు. ఇలా చేయడంతో ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని అదృశ్యమైన చిన్నారుల కేసులు సైతం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)