Breaking News

మహిళల భద్రతకు ప్రత్యేక నిధి!

Published on Thu, 08/22/2024 - 01:17

సాక్షి, హైదరాబాద్‌: పని ప్రదేశంలో మహిళలు ధైర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలయితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

మహిళల భద్రతపై బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వ హించారు. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని వివరించారు. ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో షీ టీమ్స్‌ గస్తీ పెంచుతామన్నారు. పబ్లిక్‌ ప్లేసుల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెంచుతామన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్‌ సేఫ్టీ కమి టీలు నియమిస్తామని తెలిపారు. 

మహిళల భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించే అంశాన్ని తమ ప్రభు త్వం పరిశీలిస్తోందన్నారు. మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రతీ కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని మహి ళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద సూచించారు.  

బచ్‌పన్‌ బచావోతో కలసి పనిచేస్తాం.. 
బాల కారి్మకులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో సమావేశమయింది. నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాశ్‌ సత్యార్థి నేతృత్వంలో బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనుంజయ్‌ తింగాల్, ప్రతినిధులు వీఎస్‌ శుక్లా, చందన, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేస్తుందని తెలిపారు.    

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)