ఆ ఫుడ్‌.. సేఫ్టీనా?

Published on Mon, 12/16/2024 - 03:29

‘హైదరాబాద్‌లోనే పేరున్న ఓ హోటల్‌ నుంచి  తెచ్చిన చికెన్‌ బిర్యానీ పార్శిల్‌లో బొద్దింక.. మరో హోటల్‌లో బిర్యానీలో కనిపించిన జెర్రీ... ప్రసిద్ధి చెందిన ఓ హోటల్‌ కిచెన్‌లోని ఫ్రిజ్‌లో పాడైపోయిన చికెన్‌..సేంద్రియ పంటల నుంచి తయారు చేసే స్వీట్ల దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం’...  గత కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని హోటళ్లలో ఆహార ప్రియులకు వినిపిస్తున్న చేదు వార్తలు ఇవి.

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న హోటళ్లు, ఇతర ఫుడ్‌ సెంటర్లలో ఆహార తనిఖీలకు అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఆహార పరీక్షలు జరిపే సదుపాయాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో కొన్నేళ్లుగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.

జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు హోటళ్లకు ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇవ్వడంపై చూపిన శ్రద్ధ ఆహార భద్రతపై పెట్టలేదు. రోడ్ల పక్కన గప్‌చుప్, మిర్చిబజ్జీలు, బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఇతర ఆహారం అందించే స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాళ్లు హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. 

మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా రోడ్ల పక్కనే అందించే స్ట్రీట్‌ ఫుడ్‌ పాయింట్లు అయితే కోకొల్లలు. వీధుల్లోని ఫుడ్‌ సెంటర్లతోపాటు పేరున్న హోటళ్లలో సైతం నాణ్యత ప్రమాణాలతో ఆహారం అందించడం లేదని ఇటీవల తనిఖీలతో తేటతెల్లమైంది.
 
‘ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌వీల్స్‌’ద్వారా రాష్ట్రవ్యాప్త తనిఖీలు 
ఆహార భద్రతపై వచ్చిన వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ ఫుడ్‌ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌వీ.కర్ణన్‌ను ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌గా నియమించి ఆహార భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకొనే బాధ్యతను ఆయనకు అప్పగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార తనిఖీ కోసం నాచారంలో ఒకే ల్యాబ్‌ ఉంది. 

అయితే కొత్తగా మూడింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాచారం ల్యాబ్‌ను ఆధునీకికరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా 24 మంది ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు వివిధ జిల్లాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఐదు మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి తోడు మరో పదింటిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు. 

‘ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌’పేరిట ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) ప్రత్యేకంగా ఈ మొబైల్‌ యూనిట్లను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫుడ్‌ లే»ొరేటరీలను ఏర్పాటు చేసి, నగరం, పట్టణాల్లో రోజుకో ఏరియాలో మొబైల్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. తద్వారా సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లే»ొరేటరీలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. 

దీనికోసం 10 మంది ల్యాబ్‌ టెక్నీíÙయన్లు, ఇతర సిబ్బందిని నియమించింది. జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఈ పది మంది ఇప్పటికే రంగంలోకి దిగారు. స్ట్రీట్‌ ఫుడ్స్, గప్‌చుప్‌ బండ్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల వద్ద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ నిబంధనలకు అనుగుణంగా ఆహారం ఉందో లేదో పరీక్షలు నిర్వహిస్తున్నారు.   

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)