Breaking News

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Published on Mon, 06/08/2026 - 15:12

హైదరాబాద్‌: తెలంగాణకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకాయి. గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. ఇ‍ప్పటికే ఇవి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి. ఏపీ, మహారాష్ట్రలో 30 శాతం విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. 
 
కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వరకు విస్తరించాయని, ప్రస్తుతం తెలంగాణ దక్షిణ సరిహద్దులోకి ప్రవేశించే స్థితిలో ఉన్నాయని తెలిపింది. చెప్పినట్లే ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి.

“పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. రుతుపవనాలు తెలంగాణ వ్యా‍ప్తంగా విస్తరించడానికి కేవలం 2 నుంచి 3 రోజులు చాలు” అని అధికారులు తెలిపారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణను తాకిన రుతుపవనాలు ఏపీకి ఎప్పుడంటే...?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)