Breaking News

అత్తింటి వేధింపులకు అల్లుడు బలి

Published on Wed, 11/26/2025 - 05:17

వెల్దుర్తి(తూప్రాన్‌): భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్‌ (32)కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటినుంచి వేరుకాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు.

ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడి, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయితీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.

ఈ క్రమంలో హరిప్రసాద్‌ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగా డు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం  మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్‌లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రెయినీ ఎస్‌ఐ తెలిపారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)