Breaking News

సంక్రాంతి అల్లుడు మిస్సింగ్‌

Published on Fri, 01/17/2025 - 19:12

సాక్షి, వరంగల్‌: పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యారు. అత్తారింట్లో నుంచి బుధవారం రాత్రి స్నేహితులు ఫోన్ చేస్తున్నారని, వారితో మాట్లాడి వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8:30 గంటలకు భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలవుతున్నా కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. గత ఏడాది డిసెంబర్‌ 26న వివాహం జరగ్గా, యువకుడి భార్య, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కొడుకుపై తండ్రి ఫిర్యాదు 
వరంగల్: ఆస్తులు పంచుకొని తన బాగోగులు చూసుకోవడం లేదని కొడుకుపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట దొడ్లకుంటకు చెందిన గుజ్జల రాజిరెడ్డికి చెందిన 15 ఎకరాల భూమిలో కుమారుడు వినయ్ రెడ్డి ఏడెకరాల భూమి  రాయించుకున్నాడు. ఇటీవల తల్లి అనారోగ్యంతో మరణించగా తండ్రి రాజిరెడ్డి జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.

ఇదీ చదవండి: మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..

ఆలనా పాలనా చూసుకునే కొడుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అలాంటి వాడికి తాను కష్టపడి సంపాదించిన భూమిని తనకు అప్ప చెప్పాలని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు చేశాడు. కుమారుడు వినయ్ రెడ్డి నుండి తనను కాపాడాలని తన వల్ల ప్రాణహాని ఉందని రాజిరెడ్డి పోలీసుల వద్ద వాపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు న్యాయం చేసి ఆదుకోవాలని పోలీసుల వద్ద రాజిరెడ్డి అని 63 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)