Breaking News

అల్లుడి మృతి తట్టుకోలేక అత్త..!

Published on Mon, 07/20/2026 - 07:44

జమ్మికుంట(హుజూరాబాద్‌): అల్లుడి మృతి తట్టుకోలేక గుండెపోటుతో అత్త మృతిచెందిన ఘటన జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బూర్ల రంజిత్‌ (35) ఏడాదిగా జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లిలో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. 

ఆదివారం కడుపునొప్పి వస్తుందని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు. మళ్లీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై రోడ్డుపై పడి మృతి చెందాడు. కాగా, రంజిత్‌ మృతి తట్టుకోలేక అతడి అత్త గుండేటి పద్మ(55) బోరున విలపిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. తన కూతురు డెలివరీకి ఉండడంతో సేవ చేసేందుకు ఇటీవల మహారాష్ట్ర సోలాపూర్‌ నుంచి కొత్తపల్లికి వచ్చింది. అనారోగ్యంతో అల్లుడు మృతిచెందడంతో తట్టుకోలేకపోయింది. రంజిత్‌కు భార్య శీరిష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ వివరించారు. ఇద్దరి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)