Breaking News

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి

Published on Sun, 06/23/2024 - 04:25

గన్‌ఫౌండ్రి  /సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.మహేందర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బీజే వైఎం ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఇచి్చన హామీని నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు. 

గ్రూప్‌–2, 3 పోస్టులను పెంచాలని, 25 వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో   ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీఎజీపీఎస్సీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకున్నారు. 

లాఠీచార్జీలో బీజేవైఎం అ ధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితారెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. మరికొంతమంది నిరుద్యోగ సంఘం నాయకు లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్‌రెడ్డి, గణేశ్, బి.సురేశ్, ఉపాధ్యక్షుడు ఎన్‌.మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

లాఠీచార్జీని ఖండించిన కిషన్‌రెడ్డి 
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా లాఠీచార్జీలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం అధ్యక్షుడు సెవెళ్ల మహేశ్, నాయకులు అనితా రెడ్డి తది తరులను మహేశ్వర్‌రెడ్డి పరామర్శించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)