నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
తరగతి గదిలో నాగుపాము
Published on Fri, 07/03/2026 - 09:20
మదనాపురం: వనపర్తి జిల్లా మద నాపురం మండలంలోని తిర్మలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉదయం భారీ ప్రమా దం తప్పింది. పాఠశాలలోని ఒకటో తరగతి గదిలో 30 మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అదే సమయంలో నాలుగు అడుగుల పొడవైన నాగుపాము క్లాసులోకి వచ్చేసింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నాగుపాము ప్రవేశించ డాన్ని గమనించిన ఉపాధ్యా యుడు కిరణ్కుమార్ వెంటనే హెచ్ఎంకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు పంపించి ప్రాణాపాయం తప్పించారు. వెంటనే కొత్తకోటలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన పాఠశాలకు చేరుకుని పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఉపాధ్యా యులని, కృష్ణసాగర్ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.
Tags : 1