Breaking News

ఏడుసార్లు ఒకే వ్యక్తిని కాటేసిన సర్పం!

Published on Thu, 11/06/2025 - 09:53

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు. పాము పగబట్టి కాటేస్తోందా..లేక ప్రమాదవశాత్తు పాముకాటుకు గురవుతున్నాడా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ ప్రైవేటు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా నవరాత్రుల ఉత్సవాలకు ముందు ఉదయం 11 గంటల సమయంలో ఓ పాము పడగను తొక్కడంతో దాని కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 

తర్వాత నాలుగైదు రోజులకు రాత్రి 11 గంటలకు బాత్రూంకు వెళ్తున్న సమయంలో పాము కాటువేసింది. వెంటనే తన సోదరులకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అతడిని మరో ఐదు రోజులకు మధ్యాహ్నం మరోసారి పాముకాటు వేసింది. మళ్లీ వెంటనే తేరుకుని ఆస్పత్రికి వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుధవారం, శనివారం, ఆదివారం రోజుల్లోనే శ్రీకాంత్‌ పాముకాటుకు గురవుతున్నాడు. ఇలా 33 రోజుల్లోనే ఏడుసార్లు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 

వినడానికి వింతగా అనిపించినా ఆయనను వదలకుండా పాము వెంటాడుతూ కాటేస్తుండటం సంచలనంగా మారింది. ఏదైనా సర్పదోషం ఉందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. బుధ, శని, ఆదివారం వచ్చిందంటే చాలు తనకేదో కీడు జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్లను ఎప్పుడూ అంటిపెట్టుకుంటున్నాడు. పాముకాటు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక బాధితుడు ఇబ్బంది పడుతుండటంతో ఆయన పరిస్థితి చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని పాము ఎందుకు కాటు వేస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.  

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)