Breaking News

నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్‌

Published on Thu, 12/19/2024 - 11:15

హైదరాబాద్‌, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కమిషన్‌ ఇవాళ విచారణ జరిపింది.

హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్‌ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌, స్మితా సబర్వాల్‌తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.

కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?

స్మితా సబర్వాల్‌: అది నా దృష్టిలో లేదు

కమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?

స్మితా సబర్వాల్‌: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు..  అవగాహన కూడా లేదు

కమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? 

స్మితా సబర్వాల్‌: నాకు తెలీదు

కమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలి

స్మితా సబర్వాల్‌: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది

2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశా

సీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా 

మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే 

కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?

స్మితా సబర్వాల్‌: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదు

ఇదిలా ఉంటే.. మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్‌  విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్‌, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.

ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్‌రావులదే!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి