అంతుచిక్కని ఆచూకీ.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అసలేం జరుగుతోంది?

Published on Fri, 04/11/2025 - 19:51

మహబూబ్‌నగర్‌/నాగర్‌ కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గురువారం నాటికి 48 రోజులు అవుతోంది. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. నిత్యం సహాయక సిబ్బంది 20 మీటర్ల మేర తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు తరలిస్తున్నారు.

సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కారి్మకులు చిక్కుకోగా, మార్చి 9న టీబీఎం ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌ మృతదేహాన్ని డీ2 ప్రదేశంలో వెలికితీశారు. మార్చి 25న ప్రాజెక్టు ఇంజనీర్‌ మనోజ్‌కుమార్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి అచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సొరంగం లోపల 13.73 కిలోమీటరు నుంచి 13.8 కిలోమీటరు వరకు కన్వేయర్‌ బెల్టును పొడిగించేందుకు గురువారం లోకో ట్రైన్‌ ద్వారా కన్వేయర్‌ బెల్టు, ఇతర సామగ్రిని సొరంగం లోపలికి తరలించారు. ప్రమాద స్థలం వరకు కన్వేయర్‌ బెల్టును పొడిగిస్తూ మట్టిని తవ్వే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. వారం రోజుల్లో శిథిలాల తొలగింపును పూర్తి చేసేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)