Breaking News

రంగంలోకి ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌!

Published on Mon, 02/24/2025 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ(SLBC Tunnel) సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌(Rat Hole Miners)ను రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ సిల్క్ యారా సొరంగం కుప్పకూలి లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులను.. ఈ ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీరికోసం ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసి ప్రత్యేకంగా రప్పించింది.

నసీం, ఖలీల్‌ ఖురేషీ, మున్నా, మహమ్మద్‌ రషీద్, ఫిరోజ్‌ ఖురేషీ, మహమ్మద్‌ ఇర్షాద్‌.. ఈ ఆరుగురితో కూడిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం ఢిల్లీ నుంచి ఆదివారం రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సోమవారం ఉదయం వారు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకుని, లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేపట్టనున్నారు.

కేవలం ఒక్కరోజులో బయటికి తెచ్చి..: 2023 నవంబర్‌ 13న సిల్కియారా సొరంగం ముఖ ద్వారం కుప్పకూలడంతో 41 మంది లోపల చిక్కుకున్నారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి ప్రభుత్వం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ను రంగంలో దింపింది. వారు కేవలం ఒక్క రోజులోనే కారి్మకులను సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకున్న బృందమే ఉత్తరాఖండ్‌ ఆపరేషన్‌లో పాల్గొనడం గమనార్హం. 

ఏమిటీ ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌? 
మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు వారే సహాయక చర్యలకు దిక్కుకానున్నారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)