Breaking News

నేటి నుంచి ఎస్‌ఎల్‌బీసీ హెలికాప్టర్‌ సర్వే

Published on Mon, 11/03/2025 - 03:34

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకాల పనుల పునరుద్ధరణలో భాగంగా సోమవారం నుంచి హెలికాప్టర్‌ బోర్న్‌ వీటెమ్‌ ప్లస్‌ మాగ్నెటిక్‌ జియోఫిజికల్‌ సర్వేను ప్రారంభించనున్నారు. సర్వే నిర్వహణకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం స్వయంగా నాగర్‌ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లికి చేరుకుని సర్వేను పర్యవేక్షిస్తారు. 

సర్వే జరిపే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్‌లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ సర్వే ప్రక్రియను పరిశీలించనున్నారు. నేషనల్‌ జియో ఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా దాదాపు 200 కి.మీ.ల విస్తీర్ణంలో సొరంగం తవ్వకాలు జరగాల్సిన ప్రాంతంలో భూగర్భంలో 800–1,000 మీటర్ల లోతు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది గుర్తిస్తారు. 

గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులు మరణించటంతోపాటు టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) ధ్వంసమైంది. దీంతో సురక్షిత పద్ధతిలో సొరంగం తవ్వకాలను పునరుద్ధరించడానికి నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు వరుస సొరంగాలను నిర్మిస్తుండగా, రెండో సొరంగం తవ్వకాలు పూర్తి అయ్యాయి. 

ఒకటో సొరంగాన్ని మొత్తం 43.93 కి.మీ.లు తవ్వాల్సి ఉండగా, ఇన్‌లెట్‌ వైపు నుంచి 13.94 కి.మీ.లు, దేవరకొండ వద్ద ఉన్న అవుట్‌ లెట్‌ వైపు నుంచి 20.4 కి.మీ.లు తవ్వారు. మధ్యలో 9.8 కి.మీ. ల సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. తవ్వకాలు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవ నిర్మిత సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది. 

సర్వే ఇలా చేస్తారు..
24 మీటర్ల వ్యాసం కలిగిన ట్రాన్స్‌మీటర్‌ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీసి సొరంగం తవ్వాల్సిన ప్రాంతంపై గాల్లో ఎగరడం ద్వారా ఈ సర్వే జరపనున్నారు. విద్యుత్‌ అయస్కాంత తరంగాలను ట్రాన్స్‌ మీటర్‌ భూమిలోకి పంపిస్తుంది. అవి భూగర్భంలోని పొరలకు తాకి పరావర్తనం చెందుతాయి. 

తిరిగివచ్చే తరంగాలను రిసీవర్‌ ద్వారా గ్రహించి భూగర్భంలో ఎలాంటి నిర్మాణం ఉందో అంచనా వేస్తారు. 800–1,000 మీటర్ల లోతులో ప్రమాదకర పరిస్థితులు (షీర్‌ జోన్‌) ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? అనే అంశాలను నిపుణులు అధ్యయనం చేసి సొరంగం తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించాలనేది సూచించనున్నారు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)