Breaking News

చెంచుల చెంతకు అధికారులు

Published on Thu, 01/25/2024 - 04:59

అమ్రాబాద్‌: నల్లమల అటవీ పరిధిలోని చెంచు పెంటల చెంతకు అధికార యంత్రాంగం తరలివచ్చింది. చెంచులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారింది.ఆరు నెలలుగా గిరిపోషణ  ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి బాలింతల వరకు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారి వెతలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తూ  ‘అడవే చెంచులకు అమ్మ’ శీర్షికన బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ స్పందించారు. చెంచు పెంటలను క్రమం తప్పకుండా సందర్శించి, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

దీంతో ఇన్‌చార్జ్‌ డీఎల్‌పీఓ వెంకటయ్య, పీఆర్‌ ఏఈ రుక్మాంగధ అమ్రాబాద్‌ మండలంలోని కొమ్మెనపెంట, కొల్లంపెంటను çసందర్శించారు. చెంచు కుటుంబాల బాధలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ డీఎల్‌పీఓ వెంకటయ్య మాట్లాడుతూ చెంచు కుటుంబాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావాల్సిన  వసతులు, వారి అవసరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని చెప్పారు.

ప్రధాన మంత్రి జన్‌మన్‌ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే కొల్లంపెంట, కొమ్మెనపెంటలకు కనీస రవాణా సౌకర్యం కోసం 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మర మ్మతులు చేపడతామన్నారు. ఐటీ డీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చెప్పారు. వారి వెంట ఎంపీడీఓ రామ్మోహన్, కార్యదర్శి మల్లేష్, ఉపాధి హామీ పథకం ఈసీ రేణయ్య, టీఏ అంజనేయులు తదితరులు ఉన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)