Breaking News

గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టి..

Published on Wed, 08/30/2023 - 11:54

సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్‌కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.   

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి..  రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విల‌పించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది.
చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)