Breaking News

చేయని నేరానికి ఒకరు.. చేసిన నేరం వెంటాడి మరొకరు

Published on Fri, 06/05/2026 - 04:53

ధారూరు: వికారాబాద్‌ జిల్లా స్టేషన్‌ధారూరు గ్రామంలో ప్రేమ పేరుతో సాగిన వ్యవ హారం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. చేయని నేరానికి ఒకరిని, గతంలో చేసిన నేరం వెంటాడి మరొకరిని బలి తీ సుకుంది. డీఎస్పీ అంజయ్య, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమణీబాయి, రాములు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు రాజు వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, కూతురు తులసీబాయి వికారాబాద్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేది. అలాగే నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక రాజుతోపాటే ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసేది. 

ఈ క్రమంలో రాజు, మౌనిక కలిసి తులసికి కేటాయించిన పోలీస్‌ క్వార్టర్‌లో ఆమెతోపాటు ఉండేవారు. అయితే ప్రేమ పేరుతో మౌనికకు దగ్గరైన రాజు ఆమెను లోబర్చుకొని ఆపై మొహం చాటేశాడు. కొద్ది నెలల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై రాజును నిలదీసిన మౌనిక.. ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. అనంతరం ఆమెకు సైతం పెళ్లి నిశ్చయమవగా జీర్ణించుకోలేని రాజు.. మౌనికతో తాను కలిసి దిగిన ఫొటోలను ఆమె కాబోయే భర్తకు పంపించి గొడవలు సృష్టించాడు. దీంతో ఏప్రిల్‌ 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్‌ వచ్చి రాజు, తులసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తులసిని పీఎస్‌కు పిలిపించగా మౌనిక కుటుంబ సభ్యులు ఆమెను దూషించి ఉద్యోగం ఊడగొట్టిస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన తులసి ఇటీవల ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో మౌనికపై కేసు నమోదైంది. అయితే ఆమె సైతం తాజాగా వివాహం చేసుకుంది. కానీ తనపై నమోదైన కేసు విషయంలో మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు పదేపదే బెదిరించడంతో తట్టుకోలేని రాజు గురువారం తన పొలానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

తన చావుకు మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులే కారణమని సూసైడ్‌ నోట్‌ రాశాడు. చనిపోయే ముందు భార్యకు ఫోన్‌ చేసి జాగ్రత్తగా ఉండాలని రోదిస్తూ చెప్పి పెట్టేశాడు. రాజు ఆత్మహత్య నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో తాండూరు–హైదరాబాద్‌ రోడ్డుపై మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సూసైడ్‌ నోట్‌లోని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ అంజయ్య తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)