Breaking News

తల్లీబిడ్డ మరింత భద్రం

Published on Sun, 05/11/2025 - 04:00

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రసూతి, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష ప్రసవాలకు గతంలో 130 ఉండగా, తాజాగా 93కు తగ్గినట్లు శాంపిల్‌ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదికలో వెల్లడించింది. శిశు మరణాల రేటు కూడా భారీగా తగ్గింది. 2014లో వెయ్యి జననాలకు 39 మరణాలు ఉండగా, 2021 నాటికి 27కు తగ్గినట్లు ఎస్‌ఆర్‌ఎస్‌ పేర్కొంది. 

నవజాత శిశు మరణాల రేటు 2014లో వెయ్యికి 26 ఉండగా, 2021 నాటికి 19కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2014లో వెయ్యికి 45 ఉండగా, 2021 నాటికి 31కి తగ్గిందని వివరించింది. 2021లో నమోదైన 2.0 శాతం సంతానోత్పత్తి రేటు స్థిరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 7న రిజి్రస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జీఐ) విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్‌–2021 ప్రకారం తల్లి, శిశు ఆరోగ్య సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిపింది. 

తెలంగాణ, ఏపీలో ఇలా.. 
» ఎస్‌ఆర్‌ఎస్‌ నివేదిక ప్రకారం 2030 నాటికి 8 రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)ను సాధిస్తాయని తెలిపింది. 
» ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్షకు సగటున 70 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు దేశంలో 8 ఉన్నాయి. అందులో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి.  
» తెలంగాణలో ప్రసూతి మరణాలు ప్రతి లక్షకు 45 నమోదు కాగా, ఏపీలో 46గా నమోదయ్యాయి. ప్రసూతి మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు శిశు మరణాల సంఖ్య సగటున 25 కన్నా తక్కువ ఉన్న 12 రాష్ట్రాల్లో సైతం ఏపీ, తెలంగాణ చోటు దక్కించుకున్నాయి. ఇది తెలంగాణలో 22 ఉండగా, ఏపీలో 24గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.  

 ప్రసూతి మరణాలు 2014–16లో 130, 2015–17లో 122, 2016–18లో 113, 2017–19లో 103, 2018–20లో 97, 2019–21లో 93గా నమోదయ్యాయి.  
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)