Breaking News

దొంగిలించి.. తిరిగి అప్పగించి

Published on Sat, 12/13/2025 - 04:46

 చౌటుప్పల్‌: చోరీ చేసిన బంగారు ఆభరణాన్ని తిరిగి అదే ఇంటిముందు వదిలేసి వెళ్లాడొక దొంగ. దొరికి పోతానని భావించాడో.. మరేదైనా కారణ మో తెలియకపోయినా.. రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణా న్ని మాత్రం బాధితురాలి ఇంటి ముందు వదిలేసి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని కాట్రేవు గ్రామంలో శుక్ర వారం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరా లివి. గ్రామానికి చెందిన గున్‌రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారు లు.. జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. వృద్ధ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు.

ఎప్పట్లాగే బుధవారం ఉద యం 5 గంటలకు  రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటినుంచి బయట కు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే పడుకుంది. ఆ సమయంలో తలుపు లకు గడియ పెట్టకపోవడంతో.. నేరుగా దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. పడుకు న్న వృద్ధురాలి తలకు దుప్పటి చుట్టి.. కొట్టి.. ఆమె దిండు కింద ఉన్న నాలుగున్న ర తులాల బంగారు పుస్తెలతాడుతో పారిపోయాడు. అయి తే దొంగ చోరీ చేసే ముందు వీధి దీపాలను ఆపేశాడు. ఇంత పకడ్బందీగా చో రీ చేసిన దొంగ కొత్త వ్యక్తి ఏమాత్రం కాదని, తమ గ్రామస్తుడేనని పలు వురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.

ఘటన జరిగిన రోజు పోలీ సులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పోలీసు లు జాగిలాలు వస్తాయని, దొంగ ఎక్కడున్నా పట్టుకుంటాయని గ్రామంలో చర్చ జరిగింది. ఇలాగైతే తాను దొరికిపోతానని, పరువుపోతుందని భావించిన ఆ దొంగ.. రెండు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి బంగారు ఆభర ణాన్ని తిరిగి బాధితురాలికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటి తలుపు వద్ద పుస్తెలతాడు వదిలేసి వెళ్లాడు. పాలు తీసుకొచ్చేందుకు బయటికెళ్తున్న బాధితురాలి భర్త రంగారెడ్డి.. పుస్తెలతాడును గమనించి తీసుకున్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)