Breaking News

ఎవరే నీకు అత్త.. కొడుకుని చితక్కొట్టిన తల్లిదండ్రులు

Published on Tue, 08/19/2025 - 12:29

భువనగిరిటౌన్‌ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కుమార్తెల పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్‌ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. 

కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్‌ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కూతుర్ల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్‌ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్‌ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్‌ తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు. సోషల్‌ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్‌గా మారింది.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)