Breaking News

ప్రభుత్వ సంస్థల్లోనూ సైబర్‌ భద్రత పెరగాలి

Published on Fri, 02/06/2026 - 04:16

సాక్షి, హైదరాబాద్‌ : పాలన, ప్రజా సేవలు ,కీలక మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపే సైబర్‌ ప్రమాదాలను ఎదుర్కోవడానికి బలమైన విధానపరమైన సమన్వయం, పరిపాలనా సంసిద్ధత, శాఖల మధ్య సమన్వయం అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పరిపాలనలోని అన్ని స్థాయిలలో సైబర్‌ భద్రతను అంతర్భాగం చేయాలని ఆయన సూచించారు. సైబర్‌ నేరాల నివారణ, దర్యాప్తు, బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్‌ సెక్యురిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్‌–2026 నిర్వహించారు. 

గురువారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, పరిశ్ర మల ప్రతినిధులు, సైబర్‌ భద్రత నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ రామకృష్ణారావు మాట్లాడుతూ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీసింగ్‌లోను మార్పులు వస్తున్నా యన్నారు. 

గతంలో ఫిజికల్‌ పోలీసింగ్‌ నిర్వహించేవారని.. ప్రస్తుతం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత వర్చువల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నా రన్నారు. డీజీపీ బి.శివధర్‌ రెడ్డి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న సైబర్‌ నేర విధానాలు, పెరుగుతున్న కేసుల సంఖ్య లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారాయని చెప్పారు. ఆధునిక సాంకేతికత, ప్రత్యేక శిక్షణ, అంతర్జాతీయ సహకారం అత్యవసరమని పేర్కొ న్నారు. 

టీజీ సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ మాట్లాడుతూ, పరిశ్రమలు, విద్యా సంస్థలతో కలిసి భవిష్యత్‌కు సిద్ధమైన సైబర్‌ భద్రతా వ్యవస్థ ను నిర్మించడమే టీజీ సీఎస్‌బీ లక్ష్యమని తెలిపా రు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కీలక డిజిటల్‌ కార్య క్రమాలను ప్రారంభించింది. షీల్డ్‌– 2026లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌లో రోబోటిక్‌ డాగ్స్, హ్యూమ నాయిడ్‌ రోబోలు, డ్రోన్లు, కౌంటర్‌– డ్రోన్‌ టెక్నాలజీలు, ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారా లను ప్రద ర్శించారు. 

బృంద చర్చలో పాల్గొన్న సినీ హీరో నాని మాట్లాడుతూ, ఉచి తంగా వస్తుందికదా అని పైరసీలో సినిమాలు చూడడం వల్ల ఇండస్ట్రీకి నష్టం అన్న విషయం ప్రేక్షకులు గుర్తించాలని, పైరసీలో సినిమాలు చూడడం కూడా దొంగతనం కిందకే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి సైబర్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ ‘సైఫర్‌ స్ప్రింట్‌కు దేశవ్యాప్తంగా 500కు పైగా బృందాలు దరఖాస్తు చేసుకోగా, 17 ఫైనలిస్ట్‌ బృందాలు తమ పరిష్కారాలను ప్రదర్శించాయి. విజేతలకు రూ. 5 లక్షల గ్రాంట్‌తో పాటు టీజీసీఎస్‌బీతో కలిసి పని చేసే అవకాశం కల్పించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)