Breaking News

రైల్వేస్టేషన్లలో ఎస్‌హెచ్‌జీల స్టాళ్లు

Published on Fri, 02/28/2025 - 06:11

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో తెలంగాణ మహిళా స్వ­యం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌­జీ) స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన చేతివృత్తులు, ఉత్పత్తులు, ఇతర తినుబండారాలు వంటి వాటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఎస్‌­హెచ్‌­జీ గ్రూపుల్లోని మహిళలకు ఉపాధి కల్పన, తెలంగాణ బ్రాండ్‌కు ప్రచారంతో పాటు స్వయంసహాయక సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు గిరాకీ కల్పనకు ఇవి ఉపయోగపడ­తాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 50 రైల్వే స్టేషన్‌లో (ఒక్కో దాంట్లో ఒక్కోటి) 50 స్టాళ్ల ఏర్పాటుకు పంచాయతీరాజ్, గ్రామీ­ణా­­భి­వృద్ధిశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి సీతక్క చొరవతో తయారుచేయగా, వీటి ఏర్పాటుకు రైల్వే శాఖను గ్రామీణ దారిద్య్రనిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో దివ్య దేవరాజన్‌. ఇతర అధికారులు ఒప్పించారు.

దీంతో మొదటి విడత విడతలో 14 స్టేషన్లలో స్టాళ్ల ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతులిచ్చింది. వీటిలో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏడు స్టాళ్లను మహిళా సంఘాలు ప్రారంభించాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పిండి వంటలు, ఘన్‌పూర్‌ స్టేషన్లో చేతి ఉత్పత్తులు, శంకర్‌పల్లిలో జూట్‌ బ్యాగులు, క్లాత్‌ బ్యాగులు, వికారాబాద్‌లో గాజులు, పూసలు, హారాలు... ఇలా ఒక్కో స్టేషన్లో భిన్నఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే.. 28న ఖమ్మం స్టేషన్‌లో జూట్‌ బ్యాగులు, క్లాత్‌ బ్యాగులు, ఆసిఫాబాద్‌ స్టేషన్‌లో సకినాలు, లడ్డూలు, కారంపూస, ఇతర తినుబండారాల స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే మిగతా చోట్ల కూడా ఈ స్టాళ్ల ఏర్పాటుకు పీఆర్‌ఆర్‌డీ శాఖ పరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)