Breaking News

ఏడేళ్లకే పోలీసయ్యాడు!

Published on Sat, 12/16/2023 - 07:37

బంజారాహిల్స్‌:  ఈ చిట్టి పోలీసును చూశారుగా. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ జకీర్‌ హుస్సేన్‌తో ఏదో కేసు గురించి సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కదూ. ఇతడి పేరు మోహన్‌సాయి. వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ పోలీసయ్యాడు. తన చిరకాల కోరికను ఇలా తీర్చుకున్నాడు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దామా.. ఏపీలోని గుంటూరుకు చెందిన బ్రహ్మం, లక్ష్మి దంపతులకు ఏడేళ్ల కుమారుడు మోహన్‌సాయి ఉన్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు.

ఈ బాలుడు  కేన్సర్‌ బారిన పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో ఏడాది కాలంగా కుమారుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్‌ కావాలని ఉందంటూ తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. మోహన్‌సాయి పరిస్థితి చూసి వారి మనసు చలించేది.

కన్నీటి పర్యంతమయ్యేవారు. మోహన్‌సాయి కోరికను ఆస్పత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న ‘మేక్‌ ఎ విష్‌’ ఫౌండేషన్‌ ప్రతినిధులు బంజారాహిల్స్‌ పోలీసులను కలిశారు. మోహన్‌సాయి అభిలాషను తీర్చేందుకు వారు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్‌ యూనిఫాంలో స్టేషన్‌లోకి అడుగుపెట్టిన మోహన్‌సాయికి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ జకీర్‌ హుస్సేన్‌ సెల్యూట్‌ కొట్టి స్టేషన్‌లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్లో కూర్చోబెట్టి ఠాణా పని తీరుపై ఆయన వివరించారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)