Breaking News

ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడు

Published on Fri, 11/01/2024 - 11:20

మంచిర్యాల జిల్లా( జన్నారం):  కష్టపడి చదివితే ఉద్యోగాల సాధన కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు నస్పూరి సంతోష్‌. ఆయన ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రా మానికి చెందిన రైతు నస్పూరి లచ్చన్న, రాజవ్వ దంప తుల కుమారుడు సంతోష్‌ పదో తరగతి వరకు తపాల పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. బీఈడీ రాయలసీమ యూనివర్సిటీలో పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డాడు.

2023లో రైల్వేలో ఉద్యోగాల ప్రకటన రావడంతో పరీక్షలు రాసి పాయింట్‌మెన్‌ ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరం సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు పరీక్ష రాసి ఉద్యోగం సాధించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే ఈ ఏడాది గురు కు ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఏకంగా టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యో గాలు సాధించారు. వాటిలో చేరకుండా టీజీపీఎస్సీ వేసిన నోటిఫికేషన్‌లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుని చదివారు. ఈ నెల 27న ఫలితాల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగం సాధించారు. తనను కష్టపడి చదివించిన అమ్మనాన్నల ఆశీర్వాదంతోనే ఇన్ని ఉద్యోగాలు సాధించానని సంతోష్‌ తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం చేస్తున్న సంతోష్‌ జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగంలో చేరుతానని వెల్లడించారు.

చ‌దవండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)