Breaking News

త్వరలో సెట్‌ల తేదీలు వెల్లడి

Published on Thu, 11/28/2024 - 04:58

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్‌ మొదటి వారంలో తేదీలను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్‌)పై ప్రధానంగా దృష్టి పెట్టారు. 

ఈసారి ఈ పరీక్షను ముందుకు జరపాలని, తద్వారా విద్యా సంవత్సరాన్ని ముందే ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్నామని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇటీవల మండలి ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. 

ప్రవేశ పరీక్ష, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ తేదీలను ఒకేసారి ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. యాజమాన్య కోటా సీట్లను కూడా ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో భర్తీ చేస్తామని మండలి చైర్మన్‌ తెలిపారు. దీనిపైనా త్వరలో నిర్ణయం తీసుకునే వీలుంది. 

త్వరగా తేదీలివ్వండి.. 
ఈఏపీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్‌లను ఎప్పుడు నిర్వహించాలో సూచించాల్సిందిగా టీసీఎస్‌ సంస్థను మండలి కోరింది. ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలను ఎంపిక చేసే బాధ్యత ఈ సంస్థకు అప్పగిస్తారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షల తేదీలను, ముఖ్యంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటారు. 

ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి. దీని తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమయ్యేందుకు వీలుగా టీసీఎస్‌ తేదీలను ఖరారు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలని టీసీఎస్‌ను అధికారులు కోరారు. 

ఏ సెట్‌ బాధ్యత ఎవరికి? 
ఏ ఉమ్మడి పరీక్షను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి? ఎవరిని కన్వీనర్‌గా తీసుకోవాలి? ఏవిధంగా నిర్వహించాలి? అనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి అన్ని యూనివర్సిటీల వీసీలకు వచ్చే వారం లేఖ రాయబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రతి ఏటా ఈఏపీ సెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌కు అప్పగిస్తున్నారు. 

సాంకేతిక అంశాలతో ముడిపడిన పరీక్ష కావడంతో సాంకేతిక విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. ఈసారి కూడా ఈ వర్సిటీకే ఈ సెట్‌ అప్పగించే వీలుంది. లాసెట్, ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని భావిస్తున్నారు. ఐసెట్‌ను కాకతీయ వర్సిటీకి అప్పగించే వీలుందని తెలుస్తోంది. పాలిసెట్, ఈసెట్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)