Breaking News

హజ్‌ యాత్ర దరఖాస్తుదారులకు ‘సర్వర్‌ డౌన్‌’ సమస్య 

Published on Wed, 02/22/2023 - 04:29

సాక్షి, సిటీబ్యూరో: 2023 హజ్‌ యాత్రకు దరఖాస్తుల ప్రక్రియ తీవ్ర అంతరాయాలతో కొనసాగుతోంది. దరఖాస్తులు అప్‌లోడ్‌కాక నానా తిప్పలు పడుతున్నారు. ఈ నెల 10న ఆన్‌లైన్‌ ద్వారా హజ్‌ యాత్ర దరఖాస్తుల స్వీకరణ ప్రాంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర హజ్‌ కమిటీ సర్వర్‌ డౌన్‌ చూపుతుండడంతో దరఖాస్తులు అప్‌లోడ్‌ కావడం లేదని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్ర హజ్‌ కమిటీ యాత్రికుల సౌకర్యార్థం హజ్‌ హౌస్‌లో ఎనిమిది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. అయితే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సర్వర్‌ డౌన్‌ ఉండడంతో ఒక్క అప్లికేషన్‌ కూడా అప్‌లోడ్‌ కాలేదు. 16వ తేదీ నుంచి దరఖాస్తులు అప్‌లోడవుతున్నా మధ్య మధ్యలో సర్వర్‌ పనిచేయడం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు దరఖాస్తు కోసం ఓటీపీ వస్తుంది. అయితే సమయానికి ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తు మధ్యలోనే ఆగిపోతుందని యాత్రికులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర హజ్‌ కమిటీలు సమన్వయంతో స్పందించి దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు. కాగా దీనిపై హజ్‌కమిటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి బి.షఫీవుల్లా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.

గతంలో దరఖాస్తులకు సంబంధించిన సర్వర్‌ నిర్వహణ కేంద్ర హజ్‌ కమిటీ ముంబయి అధీనంలో ఉండేదని, ప్రస్తుతం ఎన్‌ఐసీ డిల్లీ నిర్వహణలోకి మారిందని తెలిపారు. దరఖాస్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సర్వర్‌ డౌన్‌ సమస్య ఏర్పడిందని, కేంద్ర హజ్‌కమిటీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు.  

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)