Breaking News

ఔటర్‌పై కార్లు, ఇతర వాహనాలకు వేర్వేరు మార్గాలు

Published on Mon, 07/08/2024 - 11:25

మణికొండ: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న ట్రాఫిక్‌తో టోల్‌గేట్ల వద్ద వాహనదారుల పడిగాపులు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించే ఉద్దేశంతో అధిక రద్దీ ఉండే పుప్పాలగూడ టోల్‌గేట్‌ వద్ద నిర్వా­హకులు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి రద్దీ నివారణ చర్యలు చేపట్టారు. 

ఆదివారం నుంచి శంషాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఉన్న మూడు టోల్‌ వసూలు కౌంటర్లలోకి కార్లను మాత్రమే అనుమతించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గంలో కార్లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్న వాహనదారులే ప్రవేశించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్‌ లేకుండా ఆయా మార్గాల్లోకి ప్రవేశిస్తే చెల్లించాల్సిన డబ్బుకు రెండితలు వసూలు చేస్తున్నామని టోల్‌గేట్‌ నిర్వాహకులు తెలిపారు. 

ఫాస్టాగ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గాల్లోకి ఇతర వాహనదారులు రావొ­ద్దని బోర్డులు ఏర్పాటు చేసినా వారు ప్రవేశించి నగదు రూపంలో టోల్‌ చెల్లి­స్తుండటంతో రద్దీ పెరిగిపోతోందన్నారు. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్‌ ఉన్న కార్లను ఆయా మార్గాల్లో.. మిగతా వాహనాలను ఇతర కౌంటర్ల­లోకి అనుమతిస్తున్నామన్నారు. దాంతో ఆదివారం ఎక్కువగా ట్రాఫిక్‌ స్తంభించలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో అధిక రద్దీ ఉండే మరిన్ని టోల్‌ కేంద్రాల వద్ద ఇలాంటి ఏర్పాట్లను చేస్తామని వారు తెలిపారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)