Breaking News

స్మిత, మనోజ్‌ ఎపిసోడ్‌.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Published on Sun, 07/16/2023 - 21:11

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనంగా మారిన శామీర్‌పేట్‌ కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో​ షాకింగ్‌ విషయాలు ఉన్నాయి. మనోజ్‌కు స్మిత ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కాగా.. స్మితతో కలిసి డిఫ్రెషన్‌ కౌన్సిలింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెతో మనోజ్‌ సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

ఇక, రిమాండ్‌ రిపోర్టు ప్రకారం.. 2003లో స్మితతో సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. ఇక, 2018లో‌ సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి‌ భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.

మరోవైపు.. తమను మనోజ్‌ హింసిస్తున్నట్లుగా స్మిత కొడుకు CWCకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్ధ్‌ను చూడగానే మనోజ్‌ని స్మిత పిలిచారు. ఆవేశంలో ఫ్రెండ్‌ గిప్ట్‌గా ఇచ్చిన ఏయిర్‌ గన్‌తో సిద్ధార్థ్‌పై మనోజ్‌ కాల్పులు జరిపాడు. కాగా, సిద్ధార్ధ్ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్‌ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్‌, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్‌..

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)