Breaking News

గాజు చాంబర్లున్న ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌ షురూ

Published on Fri, 06/19/2026 - 04:06

సాక్షి, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో గాజు చాంబర్లు ఏర్పాటు చేస్తున్న బస్సులపై రవాణాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇంతకాలం సాధారణ కర్టెన్లతోనే సరిపెట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నిర్వాహకులు, బెర్తులకు కొత్తగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘‘గాజు చాంబర్లలో ప్రయాణికులు బందీ’’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. 

నగరంలోని మియాపూర్‌లో రంగారెడ్డి జిల్లా డీటీఓ శ్రీనివాసగౌడ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించి ప్రియా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్‌ బస్సును సీజ్‌ చేశారు. అందులో గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన తీరును పరిశీలించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఇలా నిబంధనలకు విరుద్ధంగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన బస్సులను సీజ్‌ చేసి వాటిని తొలగింపజేసి, బస్సు ఆపరేటర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్టు రవాణాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిపిన సాధారణ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 928 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపింది.  

అంతకుముందు జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ నగరంలోని పలు ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లతో భేటీ అయి, నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులు సీజ్‌ చేసి భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. సాక్షి వెలుగులోకి తెచ్చిన గాజు చాంబర్ల అంశాన్ని ప్రస్తావించి... వాటి ఏర్పాటు అంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలాగాటమాడినట్టేనని, ఆ కొత్త విధానాన్ని విస్తరించకుండా చూడాలన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)