Breaking News

ఎన్నికల్లో పట్టివేతలు : రూ.200 కోట్లు

Published on Tue, 06/04/2024 - 06:00

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించిన సోదాల్లో రూ.200,27,60,036 విలువైన నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర విలువైన పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూ.99,16,15,968 పట్టుబడినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 466 ఫ్లయింగ్‌ స్వాడ్‌లు, 89 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు కొనసాగాయి.

సోదాల్లో రూ.11,48,00,955 విలువైన మద్యం పట్టుబడింది. రూ.14,52,53,412 విలువైన నార్కోటిక్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి పట్టుబడింది. ఇవికాకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన మరో రూ.11,91,06,661 విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 7,272 లైసెన్స్‌ కలిగిన ఆయుధాలను, మరో 20 లైసెన్స్‌లేని ఆయుధాలను జప్తు చేసినట్టు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర వస్తువులు కలిపి రూ.46.3 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించింది.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)