Breaking News

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

Published on Sat, 01/21/2023 - 01:38

సికింద్రాబాద్‌: తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఆదిలాబాద్‌ వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రూట్‌లో బాంబు ఉందని ఓ యువకుడు చేసిన ఆకతాయి ఫోన్‌ సందేశం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు ఉందని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక అది పేలుతుందని ఆకతాయి పంపిన మెసేజ్‌తో ఇటు జీఆర్‌పీ, అటు ఆర్‌పీఎఫ్‌ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.45 గంటలకు చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు గంట ఆలస్యంగా నడుస్తుంది. 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫోన్‌ చేసి బాంబు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే మౌలాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలును అదే స్టేషన్‌లో నిలిపి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న  బాంబ్‌  స్వా్వడ్‌ బృందాలు తనిఖీల అనంతరం ఆకతాయి పనిగా నిర్థారించారు. రెండు గంటలు ఆలస్యంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆ మీదట ఆదిలాబాద్‌కు బయలుదేరి వెళ్లింది.  

రైలులో ప్రయాణిస్తూనే .. 
మహబూబాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ అనే యువకుడు అదే రైలులో ప్రయాణిస్తూ పోలీసులకు సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ చేశాడు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో అరాచక శక్తులు ప్రయాణిస్తున్నాయని వారు రైలును పేల్చే ప్రయత్నం చేస్తున్నారని మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఒక వైపు తనిఖీలు చేస్తూనే మరోవైపు మెస్సేజ్‌ అందిన ఫోన్‌ నెంబర్‌ సిగ్నల్‌ ఆధారంగా సందేశం పంపిన వ్యక్తి అదే రైలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  ఇన్‌స్పెక్టర్‌ పరీక్షకు హాజరై సెలక్ట్‌ కాలేదన్న ఆక్రోశంతో మెసేజ్‌ చేసినట్లే నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)