Breaking News

Telangana: నేడు రెండో విడత రుణమాఫీ

Published on Tue, 07/30/2024 - 00:56

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం దాదాపు 7 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రూ.లక్షన్నర వరకు రుణాలున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తారు. రుణ మాఫీ మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణా లకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిలో.. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమయ్యాయి.

కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కాగా రెండో విడత రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి సోమవారం రాత్రి వరకు మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారులకు కూడా లబి్ధదారుల జాబితా అందలేదని సమాచారం. రాత్రి పొద్దుపోయాక జాబితా అందుతుందని భావిస్తున్నారు. మొదటి విడతలో లక్ష వరకు రుణాలున్న అనేకమంది అర్హులకు రుణమాఫీ కాలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రెండో విడత రుణమాఫీలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.  

వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ: మంత్రి తుమ్మల 
మంగళవారం లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ.లక్ష వరకు జరిగిన రుణ మాఫీకి సంబంధించి సందేహాలు ఉన్న రైతులు.. అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రూ.లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా రైతులకు విజ్ఙప్తి చేశారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. 

ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం 
తమ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించిన పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజస విధానాలను గుర్తు చేయదల్చుకున్నానని మంత్రి తెలిపారు. ’ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టడమే వారి విధానంగా ఉండేది. ఒక ఏడాది పత్తి వద్దు అన్నారు. రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాధుడే లేరు. మరో ఏడాది పంట కాలనీలు అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.

తరువాత దాని ఉసే లేదు. వరి వేస్తే ఉరి అన్నారు.. ఆ మాట నమ్మి మొక్కజొన్న వేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారు. సన్నాల సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్‌కు వచ్చేసరికి బోనస్‌ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలే. ఇక రుణమాఫీ 2014 కానీ, 2018 కానీ.. అసలు రుణమాఫీ పథకాలు కావని, వడ్డీ మాఫీ పథకాలుగా ప్రతి రైతు చెబుతాడు..’అని మంత్రి దుయ్యబట్టారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)