Breaking News

ఆర్టీసీ బస్సుల్లో 'సీట్‌ బెల్ట్‌'..

Published on Mon, 10/06/2025 - 01:32

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌తోపాటు పక్కన ఉండే సింగిల్‌ సీటుకు కూడా సీటు బెల్టును ఉన్నతాధికారులు తప్పనిసరి చేశారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిపో మేనేజర్లు యుద్ధప్రాతిపదికన అన్ని బస్సుల్లో డ్రైవర్‌ సీటుకు, ముందుండే ప్రయాణికుల సీటుకు బెల్టులు బిగిస్తున్నారు. 

కార్లకే అమలవుతున్న నిబంధన.. 
ఏదైనా వాహనం ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకొని ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలా ప్రమాదాల్లో సీటు బెల్టు ధరించని వారు మృతిచెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే కార్లు సహా ఇతర వాహనదారులు సీటు బెల్టు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. 

అయితే కారు డ్రైవర్‌ సీటు బెల్టు ధరించకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు.. ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు డ్రైవర్లు వేగంగా ముందుకు ఎగిరిపడి గాయపడటమో లేదా మరణిస్తుండటమో జరుగుతోంది. 

ఆర్టీఐ దరఖాస్తుతో స్పందన.. 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆర్టీసీ నుంచి సీటు బెల్టులకు సంబంధించిన వివరా లు కోరారు. బస్సుల్లో సీట్లకు బెల్టులున్నాయా? వాటిని డ్రైవర్లు ధరిస్తున్నారా? ఒకవేళ ధరించకుంటే ఎన్ని కేసులు నమోదయ్యాయి? జరిమానాలు చెల్లించారా? లాంటి వివరాలు కోరారు. ప్రస్తుతం కొత్త ఆర్టీసీ బస్సులకు బెల్టులుంటున్నా వాటిని డ్రైవర్లు వినియోగించనందున క్రమంగా అవి ఊడిపోతున్నాయి. 

వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయట్లేదు. ఆర్టీఐ కింద వచ్చిన అర్జీకి అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున నిబంధనలను పాటించట్లేదని ఆర్టీసీ అధికారికంగా ఒప్పుకున్నట్టవుతుంది. అందుకే వెంటనే అన్ని బస్సుల్లో సీటు బెల్టు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు డిపో మనేజర్లను ఆదేశించగా డిపో మేనేజర్లు ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. 

డ్రైవర్లు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలని ‘గేట్‌ మీటింగ్‌’సమయంలో డిపో మనేజర్లు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ముందు సీట్లో కూర్చొనే వారు కూడా ధరించేలా చూడాలని సూచిస్తున్నారు. కాగా, కొత్త బస్సుల్లో చిట్టచివరి సీట్ల వరుసలోని మధ్య భాగం సీట్ల (దారి ఎదురుగా ఉండే సీట్లు)కు కూడా బెల్టులు ఉన్నా ఆ విషయం ప్రయాణికులకు తెలియట్లేదు.   

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)