నిజాయతీకి ఫిదా!

Published on Wed, 01/01/2025 - 09:39

సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వస్తే చిరు వ్యాపారులు అధిక ధరలు చెబుతారనేది అందరి అభిప్రాయం. మనం వేరే రాష్ట్రాలు లేదా దేశానికి వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవం ఒకటి రెండుసార్లు మనకు కూడా బహుశా ఎదురయ్యే ఉంటుంది! అయితే.. మన హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా పర్యటిస్తున్న ఓ విదేశీయుడికి భిన్న అనుభవం ఎదురైంది. చారి్మనార్‌ను చూసేందుకు స్కాట్లాండ్‌కు చెందిన హ్యూ అనే వ్యక్తి వచ్చాడు. 

అక్కడ కలియదిరుగుతూ నగర ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆభరణాలు, మట్టి గాజుల గురించి ఆరా తీస్తూ వస్తున్నాడు. అప్పుడే ఓ చిరు వ్యాపారి ముత్యాల హారాలను అమ్ముతూ కనిపిస్తే వాటి ధర ఎంతో అడిగాడు. అయితే.. అందరిలా అవి ఒరిజినల్‌ ముత్యాలంటూ మభ్య పెట్టకుండా ప్లాస్టిక్‌ ముత్యాలని నిజాయతీగా చెప్పాడు. అలాగే.. లైటర్‌తో కాల్చి ఇవి, ఒరిజినల్‌ కాదని పేర్కొన్నాడు. పైగా ధర కూడా రూ.150 అనడంతో చాలా నిజాయతీపరుడివి అంటూ కితాబిచ్చాడు. 

తిరిగి పర్యాటకుడి వివరాలను ఆరా తీశాడు. స్కాట్లాండ్‌ అని సమాధానం చెప్పాడు. వెంటనే పర్యాటకుడిని ఆ చిరు వ్యాపారి ఫ్రెంచ్‌లో పలకరించాడు. ఓ..ఫ్రెంచ్‌ కూడా వస్తుందా అని అడిగి షాక్‌ అయ్యాడు. ఇదంతా వీడియో తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. పైగా హైదరాబాద్‌ పరువు కాపాడావంటూ నెటిజన్లు అతడిని తెగ పొగిడేస్తున్నారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)