పేపర్‌ లీక్‌.. టెన్త్‌ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ

Published on Mon, 04/03/2023 - 18:45

సాక్షి, వికారాబాద్‌: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్‌ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన క్లారిటీ ఇచ్చారు.

రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్‌ క్లాస్‌ పరీక్ష  పేపర్‌ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు..

సస్పెండ్‌ అయ్యింది వీళ్లే..
1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్)

2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్‌మెంట్‌ అధికారి)

3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్)

4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్)

చదవండి: టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ ఘటనపై తెలంగాణ సర్కార్‌ సీరియస్‌..

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)