Breaking News

డిస్‌లొకేటెడ్‌ టీచర్లకు వార్నింగ్‌!

Published on Sat, 08/24/2024 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో డిస్‌లొకేట్‌ అయిన టీచర్ల వైఖరిపై సొసైటీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. జోనల్‌ కేటాయింపుల్లో భాగంగా డిస్‌లొకేట్‌ చేసిన నేపథ్యంలో ఆయా ఉద్యో గులంతా ఈనెల 21న సొసైటీ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. సొసైటీ కార్యాలయ పరిధిలో గుంపుగా అల్లరి చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ధర్నా చేపట్టడం, కార్యా లయంలోకి బలవంతంగా ప్రవేశించడం, దురుసు ప్రవర్తన ఘటనలపై సొసైటీ అధికారులు మండిపడుతున్నారు.

సమస్యలుంటే పలు వేదికల వద్ద నిబంధనలకు లోబడి విన్నవించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆందోళనపూరిత వాతావరణం సృష్టించడం నిబంధనలకు విరుద్ధమని టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి అలగు వర్షిణి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వారంతా శిక్షార్హులని, అయినప్పటికీ చివరి అవకాశంగా భావిస్తూ వారికి లిఖితపూర్వక హెచ్చరికలు జారీ చేయాలని జోనల్‌ అధి కారులను ఆమె ఆదేశించారు. ఈమేరకు 142 మంది ఉద్యోగులతో కూడిన జాబితాను సంబంధిత జోనల్‌ అధికారులకు ఆమె పంపారు.

మరో వైపు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి గురు కుల పాఠశాలకు చెందిన టీజీటీ కె.విజయనిర్మలను సొసైటీ కార్యా లయానికి హాజరై వివరణ సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం ఉదయం 11గంటలకు కార్యదర్శి ఎదుట హాజరైనట్లు సమాచారం. మరోవైపు విజయనిర్మలను సస్పెండ్‌ చేస్తూ సొసైటీ కార్య దర్శి అలగు వర్షిణి 22వ తేదీనే ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 

ప్రజాభవన్‌లో వినతులు: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో డిస్‌లొకేట్‌ అయిన ఉద్యోగులు పలువురు శుక్రవారం ప్రజాభవన్‌కు చేరుకుని ప్రజావాణిలో ప్రత్యేకాధికారి దివ్యకు వినతులు సమర్పించారు. స్థానికతను పరిగణించకుండా ఉద్యోగ కేటాయింపులు జరపడాన్ని తప్పుబట్టిన ఉద్యోగులు... తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)