Breaking News

వచ్చే నెల 15కల్లా ఇందిరా మహిళాశక్తి చీరలు

Published on Sat, 10/11/2025 - 06:03

సాక్షి, హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరా మహిళాశక్తి(Indira Mahila Shakti) చీరలను వచ్చే నెల 15 నాటికి పంపిణీ చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటివరకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) ఆధ్వర్యంలో 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోదాములకు సరఫరా చేసినట్టు వెల్లడించారు.

సచివాలయంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌తోపాటు ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల శుక్రవారం సమీక్షించారు. చీరల కోసం అవసరమైన వస్త్రోత్పత్తిలో 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉపాధి దక్కిందన్నారు. చీరల ఉత్పత్తిని పూర్తి చేసి నవంబర్‌ 15లోగా జిల్లా స్థాయి గోదాముల నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  

రుణమాఫీ ప్రక్రియ వేగవంతం: చేనేత కార్మికుల రుణమాఫీని వేగవంతం చేసి, త్వరగా వెరిఫికేషన్‌ పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని తద్వారా 6,780 మందికి రూ.లక్ష వరకు రుణ విముక్తి లభిస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. తెలంగాణ చేనేత లేబుల్‌ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన వ్రస్తోత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.

తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 13,371 మంది నమోదు చేసుకోగా మరో 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాత్కాలికంగా నడుస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐటీహెచ్‌)ను పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌లోకి మార్చేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని  ఆదేశించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)