Breaking News

ప్రాణాలు తీస్తున్న సరదా

Published on Mon, 04/07/2025 - 10:44

మెదక్‌జోన్‌: ఈత సరదా యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో కేవలం ఆరునెలల వ్యవధిలో పాతికేళ్లలోపు యువకులు నలుగురు మృత్యువాత పడ్డారు. గతంలో మంజీరా నదిలో ఇద్దరు.. తాజాగా శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడిలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

అందరూ పాతికేళ్లలోపు వారే..  
అయితే బొల్లారం మత్తడి మెదక్‌ మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా ఉంటుంది. ఇందులోకి ఘనపూర్‌ ఆనకట్ట నుంచి నీరు వచ్చి చేరటంతో మండు వేసవిలో నిండుకుండలా మారుతుంది. దీంతో యువత అందులోకి ఈత కోసం వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ మత్తడి నలుగురు యువకులను బలి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జానకంపల్లికి చెందిన యువకుడు మిత్రులతో కలిసి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతిచెందాడు. అలాగే తిమ్మక్కపల్లికి చెందిన మరో యువకుడు మత్తడిలో మునిగి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో మంజీరా నది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది.

 భక్తులు ముందుగా మంజీరా పాయల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే గత నెల 1వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఏడుపాయలకు వచ్చి మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. అందులో ఇద్దరు యువకులు పోతంశెట్‌పల్లి 2వ బ్రిడ్జి వద్ద నదిలో ఈతకు దిగి నీటమునిగి దుర్మరణం చెందారు. మంజీరాలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాళ్లు రప్పలతో నిండి ఉంది. ఈ ప్రదేశంలోనికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ నిరంతరం పోలీస్‌ సిబ్బందిని ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. 

పండుగ పూట విషాదం 
మెదక్‌ మండలం బాలనగర్‌కు చెందిన తుండు అనిల్‌ (17), తుండుం నవీన్‌ (25) శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడికి ఈతకు వెళ్తున్నా మని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు మత్తడి వద్దకు వెళ్లి చూడగా గడ్డపై ఇద్దరి దుస్తులు, చెప్పులు కనిపించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా ఆదివారం మధ్యా హ్నం ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన తుండుం లలిత, పద్మయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. 

కాగా కూతురు పెళ్లిచేయగా.. అనిల్‌ పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే చేతికందివచి్చన కొడుకు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే గ్రామానికి చెందిన తుడుం బాలయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నీట మునిగి మృతిచెందిన నవీన్‌ (25) రెండో కుమారుడు. అతడికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. భర్త నీటి మునిగి చనిపోయాడని తెలియటంతో ఆమె రోదనలు మిన్నంటాయి.  

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)