Breaking News

హాస్టల్‌ వార్డెన్‌ అరాచకం.. విషం పెట్టి విద్యార్థులను చంపేయండి అంటూ..

Published on Sat, 01/03/2026 - 14:29

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హాస్టల్‌ వార్డెన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపండి అంటూ వంట మనుషులతో మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో, సదరు హాస్టల్‌ వార్డెన్‌పై పేరెంట్స్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌ వార్డెన్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్‌ ఎస్సీ హాస్టల్‌లో తమ సమస్యలపై విద్యార్థులు ధర్నా చేశారు. దీంతో, హాస్టల్‌ వార్డెన్‌ కిషన్‌ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బూతులతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడుతూ.. విద్యార్థులు తినే అన్నంలో విషయం కలిపి చంపండి అని వంట మనుషులకు చెప్పాడు. అంతటితో ఆగకుండగా హాస్టల్‌ భవనంపై నుంచి విద్యార్థులను తోసేసి చంపేస్తా అంటూ హెచ్చరించారు. దీంతో, వార్డెన్‌ కిషన్‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయాన్ని హాస్టల్‌ విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పడం ఈ విషయంలో చర్చనీయాంశంగా మారింది. హాస్టల్‌ వార్డెన్‌ తీరుపై ఆగ్రహం​ వ్యక్తం చేసిన పేరెంట్స్‌.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, కలెక్టర్‌ వార్డెన్‌ కిషన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)