Breaking News

గుడ్‌ న్యూస్‌: వీఆర్‌ఏల కోసం సూపర్‌ న్యూమరరీ పోస్టులు, ఉత్తర్వులు జారీ

Published on Fri, 08/04/2023 - 17:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వీఆర్‌ఏలను పలు శాఖల్లో విలీనం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖల్లో సూపర్‌ న్యూమరరీ పోస్టులను కల్పించేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14,954 సూపర్‌ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్‌ అసిస్టెంట్, మున్సిపల్‌ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్లు (జూనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీ), రెవెన్యూ శాఖలోనే 2,113 రికార్డు అసిస్టెంట్లు, 679 సబార్డినేట్‌/చైన్‌మెన్‌ పోస్టులు, సాగునీటి శాఖ పరిధిలో 5,073 లస్కర్లు, హెల్పర్‌ పోస్టులు, మిషన్‌ భగీరథలో 3,372 హెల్పర్‌ పోస్టులను కల్పించేందుకు అనుమతిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కల్పిస్తున్నారన్న దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)