Breaking News

ట్రైబల్ వ‌ర్సిటీ లోగోలో ప్రధాన ఆకర్షణలు ఇవే..

Published on Wed, 10/08/2025 - 18:05

తెలంగాణలో సమ్మక్క– సారక్క సెంట్ర‌ల్‌ ట్రైబల్ యూనివ‌ర్సిటీ లోగో విడుద‌లైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ లోగోను విడుద‌ల చేశారు. ఇందులో ప‌లు విశేషాలు ఉన్నాయి.

లోగోలో ప్రధాన ఆకర్షణలు.. 
⇒ సమ్మక్క–సారలమ్మ ట్రైబల్‌ యూనివర్సిటీ లోగో మధ్య సమ్మక్క–సారలక్క గద్దెలు 
⇒ సమ్మక్క దేవత కుంకుమకు చిహ్నంగా మధ్యలో ఎర్రటి సూర్యుడు 
⇒ ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఆసీనులైన ఇద్దరు వన దేవతలు 
⇒ గిరిజన ఆహార్యం, సౌందర్యానికి సూచికగా నెమలి ఈకలు 
⇒ సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం  

త్వరలో కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ సమ్మక్క– సారలమ్మ యూనివర్సిటీని సందర్శిస్తానని, కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సమక్క– సారలమ్మ సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ వైఎల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో.. సమ్మక్క– సారలమ్మ కేంద్ర విశ్వ విద్యాలయాన్ని సాధించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

చ‌ద‌వండి: చొక్కా విప్పి.. చితిపై కప్పి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)