Breaking News

సహకార సంఘాల్లో ఔషధాల విక్రయం 

Published on Sun, 07/16/2023 - 02:13

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయాధారిత సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)లో ఇకపై ఔషధాలను కూడా విక్రయించాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. చౌకగా లభించే జనరిక్‌ మందులను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సహకార సంఘాలు రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తున్నాయి.  ధాన్యం, ఇతర పంటల కొనుగోలుతోపాటు కొన్ని జిల్లాల్లో పె ట్రోల్‌ బంక్‌లు, సూపర్‌మార్కెట్లు, వే బ్రిడ్జిలు కూడా ఈ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో సొసైటీల్లో జనరిక్‌ మందులను విక్రయించాలని నిర్ణయించారు.  

జిల్లాకు నాలుగు సంఘాలు ఎంపిక.. 
రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాలున్నాయి. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు అనుబంధంగా 798 పీఏసీఎస్‌లు ఉండగా, వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా మరో 108 సహకార సంఘాలున్నాయి.

కాగా, ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాకు నాలుగు జన్‌ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పకడ్బందీగా నిర్వహించే నాలుగు సొసైటీల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార శాఖాధికారులను ఆదేశించింది.

ఈ ఆదేశాల ప్రకారం జిల్లా సహకార శాఖాధికారుల నుంచి ఎంపిక చేసిన సహకార సంఘాల (సొసైటీ) వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లానుంచి ఐదు సంఘాల పేర్లు పంపించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, అందోల్‌ సహకార సంఘాలు ఇందులో ఉన్నాయి. 

ఫార్మసీ లైసెన్స్‌లు ఎలా? 
ఔషధాలు విక్రయించాలంటే ఫార్మసీ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. అయితే సొసైటీల్లో జన్‌ ఔషధి కేంద్రాలకు ఫార్మసీ లైసెన్సులు ఎలా? అనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని సహకారశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మసిస్టును నియమించుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)